Home » Latest Stories » విజయ గాథలు » 25 యేళ్ళకే, అప్పడాల వ్యాపారంతో, బిజినెస్ లో దూసుకుపోతున్న యువ కెరటం!

25 యేళ్ళకే, అప్పడాల వ్యాపారంతో, బిజినెస్ లో దూసుకుపోతున్న యువ కెరటం!

by Bharadwaj Rameshwar

నిండా పాతికేళ్ళు కూడా లేవు. ఇంట్లో పెద్దవాడు. చిన్నప్పటి నుంచి వాలీబాల్ ఆటగాడిగా జాతియ స్థాయిలో తన ప్రతిభ చూపించాలి అనేది అతడి కల! అందుకోసం, నిరంతరం కష్టపడ్డాడు, ఆఖరికి చదువును కూడా పక్కన పెట్టాడు, కానీ అతడి కల కూతవేటు దూరంలో ఆగిపోయింది. 

… కట్ చేస్తే, అప్పడాల బిజినెస్ ను ప్రారంభించి, నెలకు లక్ష దాకా సంపాదిస్తూ, ఈ తరం వారికి, బిజినెస్ లో గట్టి పోటీ ఇస్తున్నాడు. 

ఎంతో స్ఫూర్తిదాయమైన సుప్రీత్ స్టోరీ ను తెలుసుకోండి!

కన్న కల, క్షణాల్లో చెదిరిపోయి… 

బెంగళూరుకు చెందిన సుప్రీత్ కు, చిన్నప్పటి నుంచి,  నేషనల్ టీం లో వాలీబాల్ ఆటగాడిగా ఆడాలి అనేదే  అతడి ఊపిరిగా బతికాడు. దానికోసం, అతడు ఎంతో కష్టపడ్డాడు. చదువుని కూడా పక్కన పెట్టాడు. ఎలాగో చదువులో అత్తెసరు మార్కులతోనే  డిప్లొమా పూర్తి చేసాడు. 

అన్ని రకాలుగా అతడికి అర్హతలు ఉన్నప్పటికీ, ఎత్తు తక్కువ అన్న ఒకే ఒక్క కారణంతో, అతడిని సెలక్షన్ కమిటీ నిరాకరించింది. 

సుప్రీత్ కి ఆ సమయంలో, తన కల, కళ్ళ ముందే పేకమేడల్లా కూలిపోతున్నట్టు అనిపించింది. ఇంట్లో పెద్దవాడు కావడంతో, ఏదొక బిజినెస్ ప్రారంభిద్దాం అనుకుని ఫైనాన్స్ కంపెనీని స్థాపించాడు. 

పది లక్షల నుంచి పది వేలకు పడిపోయి…

వ్యాపారం పై మక్కువతో, ఫైనాన్స్ కంపెనీ ప్రారంభించి, మొదటి సంవత్సరంలో దాదాపు 10 లక్షల దాక సంపాదించాడు. ఆ లాభంతో మినరల్ వాటర్ డబ్బా సర్వీస్ ను ప్రారంభించాడు. అంత చక్కగా సాగుతుంది అనుకున్న క్రమంలో, ఊహించని షాక్. 

ఫైనాన్స్ పై అవగాహనా లేకపోవడం వల్ల , 80 లక్షల దాకా నష్టపోయాడు. ఇది, సుప్రీత్ ని  కోలుకోలేని దెబ్బ తీసింది. 

ఉన్న భూములు, అమ్మ నగలు తాకట్టు పెట్టి, కొంతవరకు అప్పులు తీర్చాడు. మంచినీళ్ల సర్వీస్ ద్వారా, అతడికి నెల నెలా పది వేల రూపాయలు మాత్రమే సంపాదన వచ్చేది. సంవత్సరానికి పది లక్షల దాకా సంపాదించిన, సుప్రీత్ ఒక్కసారిగా నెలకు పదివేలు సంపాదించే స్థాయికి పడిపోయాడు. 

ఒక్క Boss Wallah వర్కుషాప్ అతడి జీవితాన్నే మార్చేసింది

ఏం చేసి, స్థిరపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉన్న సుప్రీత్ జీవితంలో, అద్భుతంలా ప్రవేశించింది, Boss Wallah. వారు నిర్వహించిన workshopలోBoss Wallahసంస్థాపకుడు సుధీర్ గారు బిజినెస్ గురించి మాట్లాడిన ప్రతి మాట, సుప్రీత్ గుండెల్లో ముద్రించుకుపోయింది. ఈ వర్కుషాప్ గురించి ముందే తెలిసి ఉంటె, నా ఎనబై లక్షలు పోగొట్టుకుని ఉండేవాడిని కాదు, అంటారాయన! 

బిజినెస్ లో ఎప్పుడు, మన ఆదాయం మూడు నాలుగు విధాలుగా, వచ్చేట్టు చూసుకోవాలి అని చెప్పిన సుధీర్ గారి ప్రోత్సహంతో, వివిధ బిజినెస్ ల గురించి Boss Wallah లో తెలుసుకుంటూ ఉండేవాడు. 

కేవలం పదివేల పెట్టుబడితో… లండన్ దాకా!

Boss Wallah లో ఎన్నో కోర్సులను, నేర్చుకుని… చివరికి బెంగళూరు ప్రాంతంలో అప్పటి వరకు ఎక్కడా లేని, అప్పడాల పరిశ్రమను స్థాపిద్దాం అనే ఆలోచనకి వచ్చాడు.  ఇందుకోసం కేవలం పదివేల పెట్టుబడితో, కార్ షెడ్లో అప్పడాలు చెయ్యడం  ప్రారంభించాడు. 

చుట్టూ పక్క తెల్సిన వాళ్ళు, బంధువులు అందరికి తన అప్పడాలు ఉచితంగా ఇచ్చి, వాటి మీద అభిప్రాయం తెలుసుకుని, చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి, 

చివరికి, ఎక్కువ కాలం మన్నే అప్పడాలు చెయ్యడం ప్రారంభించాడు.

“మెషిన్ తో ఎండబెట్టిన అప్పడాలు కేవలం ఆరు నెలల వరకు మాత్రమే నిలువ ఉంటాయని, అందుకే తానూ అప్పడాలు కేవలం సూర్యరశ్మిలో మాత్రమే ఎండబెడతాను, అందువల్లనే, రెండేళ్ల వరకు తన అప్పడాలు తాజాగా ఉంటాయి” అని చెప్పాడు. వీటితో పాటుగా, అప్పడాల ఎలా చెయ్యాలి, వాటిని ఎలా భద్రపరచాలి, అలాగే ప్యాకింగ్ ఎలా చెయ్యాలో Boss Wallah  నుంచి నేర్చుకున్నాడు. 

 ఇప్పుడు తన అప్పడాలను  లండన్ మరియు ఇతర దేశాల నుంచి వాట్స్ యాప్ లో ఆర్డర్ చేస్తున్నారని సంతోషంగా చెప్తూ ఉంటాడు, సుప్రీత్. 

ఈ బిజినెస్ ను ఇంకా అభివృద్ధి చేసి, పది వేలమందికి ఉపాధి కల్పించడం తన జీవితాశయం అని చెప్పాడు.   

కష్టాలు జీవితాన్ని కుదిపేసినప్పుడు, వాటి నుంచి బయటపడి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న, సుప్రీత్ మన అందరికి ఒక ఆదర్శం! మీరు కూడా మీ కష్టాల నుంచి బయటపడి, సొంతంగా బిజినెస్ start చేయాలి అనుకుంటే, Boss Wallah మీకెప్పుడు సహాయంగా ఉంటుంది. 

Related Posts

© 2025 bosswallah.com (Boss Wallah Technologies Private Limited.  All rights reserved.