Home » Latest Stories » విజయ గాథలు » ఆకాశమే హద్దుగా సాగిపోతున్న, 65 ఏళ్ళ యంగ్ ఎంట్రప్రెన్యూర్!  

ఆకాశమే హద్దుగా సాగిపోతున్న, 65 ఏళ్ళ యంగ్ ఎంట్రప్రెన్యూర్!  

by Rishitaraj

“మనం ఏదైనా సాధించాలి అంటే, ముప్పై యేళ్లలోపే సాధించాలి, ఆ తర్వాత ఏం సాధించలేము” అని అందరూ వినడం వింటూనే ఉంటాం. “ఆశయం వుంటే, ఏదైనా సాధించవచ్చు, వయసేం అడ్డు కాదు/రాదు” అని నిరూపించి, ఆ అందరితోనే ‘శెభాష్’ అనిపించుకున్న, నాగలక్ష్మీ గారి అద్భుత ప్రయాణం, మీరు ఈరోజు తెలుసుకుంటారు. ఆసక్తిగా ఉన్నారా? లేట్ లేకుండా, స్టోరీ చదివెయ్యండి మరీ!

పంతులమ్మ నుంచి పికిల్ బిజినెస్ ఓనర్!

నాగలక్ష్మీ గారు, ఇంతకుముందు టీచర్ గా పనిచేసేవారు. టీచర్ పని చేస్తున్న సమయంలో, హాబీగా పచ్చళ్ళను తయారు చేయడం ప్రారంభించారు. వాటిని, బంధువులకు, ఇరుగు-పొరుగు వారికి ఇస్తూ, ఉండేవారు. వారి దగ్గరి నుంచి, మంచి ఫీడ్ బ్యాక్ అందుకోవడం, నాగలక్ష్మీకి మంచి ఉత్సహాన్ని ఇచ్చింది. వారికి ఈ వ్యాపారం వైపుగా అడుగులు వేయాలి అనిపించింది. అనుకున్నదే తడవుగా, “సూర్య అయ్యంగార్ హోమ్-మేడ్  ప్రొడక్ట్స్ స్థాపించారు. వారి తండ్రి & సోదరుడి సహాయంతో 20 ఏళ్లగా, ఈ బిసినెస్ కొనసాగిస్తూ ఉన్నారు. 

పచ్చళ్ళ వ్యాపారం నుంచి సంపాదన సాధ్యమేనా?

ఎన్నో ఏళ్లుగా , ఇదే బిజినెస్లో ఉన్నప్పటికీ, వారి బిజినెస్ అంతంతగానే సాగుతుంది. రుచిలో అమోఘంగా, ఎంతో క్వాలిటీతో తయారు చేసే నాగలక్ష్మీ గారి పచ్చళ్ళను తిన్నవారందరూ ఫిదా అయ్యారు. అయితే, ఇవి ఎక్కువమందిని చేరుకోలేకపోయాయ్. అందుకు ప్రధాన కారణాలు, వారికి పచ్చడి, పొడులు/ మసాలాలు చేయడమే కానీ, వాటిని ఒక వ్యాపారంగా & జీవనోపాధిలా మార్చుకోవడంలో అంతగా అవగాహన లేకపోవమే!

కొందరికే తెలిసిన నాగలక్ష్మీ గారి పచ్చళ్ళు… అందరినీ చేరేదెలా?

 పచ్చళ్ళ వ్యాపారం గురించి A- Z!

ఒకరోజు నాగలక్ష్మీ గారు, సీరియల్ చూస్తూ ఉండగా, Boss Wallah ప్రకటన చూశారు. వారికి, చాలా ఆసక్తిగా అనిపించింది. అదే ఆసక్తితో, పచ్చళ్ళ వ్యాపారం కోర్సు పొంది, నేర్చుకోవడం ప్రారంభించారు. ఇన్ని రోజులు, వారి బిజినెస్ ఏయే కారణాల వల్ల అందరిని చేరుకోలేకపోయిందో తెలుసుకున్నారు. అదే మార్కెటింగ్! అవును, ఏ వ్యాపారమైనా, ఉత్పత్తి అయినా, సర్వీస్ అయినా ప్రజలను చేరుకోవడం ఎంతో ముఖ్యం. ఇక్కడే మనకు మార్కెటింగ్ అవసరం ఎంతో ఉంది. 

వారు Boss Wallah నుంచి మార్కెటింగ్ వ్యూహాలను ఒడిసిపట్టారు. ఇందులో బోధించబడే అంశాలు ఎంతో  సులభంగా & ఆసక్తికరంగా ఉండడంతో, దీని నుంచి బ్రాండింగ్, ప్రైసింగ్, డిమాండ్ గురించి అవగాహన పొందారు. 

అన్నీ రకాల బిజినెస్ల కొరకు వన్-స్టాప్:

బిజినెస్ గురించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవడం ద్వారా, వీరి లాభాలు 10-12% పెరిగాయి. ఇప్పుడు వరకు, ఈ బ్రాండ్ గురించి తెలియని వారు కూడా, ఆన్లైన్ లో చూసి, వారికి ఆర్డర్ ఇస్తున్నారు. ప్రస్తుతం, వీరి దగ్గర 200-300 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. వాట్సాప్ గ్రూప్‌ ద్వారా, వారి అమ్మకాలు వేగవంతం చేశారు. త్వరలో, స్టోర్ మరియు ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా తన వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నారు. 65 ఏళ్లలో కూడా వారి ధృడ సంకల్పం మరియు వ్యవస్థాపక స్ఫూర్తి నిజంగా స్ఫూర్తిదాయకం!

భవిష్యత్తులో, ప్రత్యేకంగా పికిల్ షాప్స్ ఏర్పాటు చేసి స్థానిక మరియు హోల్‌సేల్ మార్కెట్‌లలో విక్రయించాలని ఆలోచిస్తున్నారు. ఉత్పత్తులను విక్రయించడానికి ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ను నిర్మించే పనిలో ఉన్నారు. 

Boss Wallah చెంతనుండగా, మీ వ్యాపారం గురించి చింతయెలా దండగ! 

Boss Wallah కోర్సుల నుంచి నాగలక్ష్మి గారు, పచ్చళ్ళ ప్యాకెజింగ్ ధరల వ్యూహాలు, మార్కెటింగ్ పద్ధతులు మరియు చట్టపరమైన అవసరాలు వంటి ముఖ్యాంశాల గురించి తెలుసుకున్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా, 2021 సంవత్సరంలో, FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అఫ్ ఇండియా) నుంచి బ్రాండ్ లైసెన్స్ కూడా పొందారు. ఈ కోర్సులు, ఈ బిజినెస్లో ఉండే వారి సవాళ్ళను అధిగమించి, విజయ ద్వారంపై వారిని నిలబడేలా చేశాయి.  మీరూ, ఈ రోజే Boss Wallah లక్ష్యాల గురించి తెలుసుకుని, గెలుపు జెండాపై మీ పేరును లిఖించండి!

Related Posts

© 2025 bosswallah.com (Boss Wallah Technologies Private Limited.  All rights reserved.