Home » Latest Stories » విజయ గాథలు » “అందంగా” నేర్పిస్తూ నెలకు రూ.1 లక్ష సంపాదిస్తూ…

“అందంగా” నేర్పిస్తూ నెలకు రూ.1 లక్ష సంపాదిస్తూ…

by Bharadwaj Rameshwar

“బలంగా కోరుకుంటే ఏదైనా జరిగిపోతుంది. అయితే కోరికతో పాటు కష్టపడే తత్వం కూడా అలవరుచుకోవాలి.” ఈ వాఖ్యానాలు కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన నందినికి సరిగ్గా సరిపోతాయి. చిన్నప్పటి నుంచి ఆమె కన్న కలలు పెళ్లి తర్వాత నిజమయ్యాయి. దీంతో తన మనసుకు నచ్చిన పని చేస్తూ నెలకు అక్షరాల రూ.1 లక్షకు పైగా సంపాదిస్తున్నారు. ఇందుకు దోహదం చేసినది ఎవరూ, ఆమె భవిష్యత్ ప్రణాళికలు తదితర విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

చిన్నప్పటి నుంచి మక్కువ… అయితే

బెంగళూరుకు చెందిన నందిని రామ్ ప్రసాద్‌కు చిన్నప్పటి నుంచి అందంగా తయారవ్వడమన్నా, అందంగా తయారు చేయడం అన్నా ఎంతో ఇష్టం. దీనినే తన కెరీర్‌గా మలుచుకోవాలనుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె చాట్ సెంటర్‌లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మేకప్ ఆర్టిస్ట్ కావాలన్న తన ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు. ఈ క్రమంలో Boss Wallah గురించి తెలిసింది. వెంటనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని మేకప్‌కు సంబంధించిన కోర్సులో చేరి అందులోని మెళుకువలను నేర్చుకున్నారు. 

నేర్పిస్తూ..లక్షల ఆదాయాన్ని అందుకుంటూ…

మేకప్ ఆర్టిస్ట్‌కు సంబంధించిన అన్ని మెళుకువలను నేర్చుకున్న తర్వాత కొంత కాలం పాటు బ్యూటీషియన్‌ సొంతంగా ఓ బ్యూటీ పార్లర్ నడిపారు. అయితే ఈ రంగంలో ఇంకా ఏమైనా చేయాలని భావించారు. దీంతో మేకప్ స్టుడియోను స్థాపించి తాను నేర్చుకున్న విద్యను ఔత్సాహిక యువతులకు నేర్పించేవారు. ఇందుకు గాను కొంత రుసుము వసూలు చేస్తూ వచ్చారు. ఇలా ప్రతి నెలా రూ.1 లక్ష ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. నందిని ఈ బ్యూటీషియన్ కోర్సును సోమవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే నేర్పిస్తున్నారు. శని, ఆదివారాల్లో తన వద్దకు వచ్చేవారి అందానికి మెరుగులు దిద్దుతూ అదనంగా సంపాదిస్తున్నారు. ఈ విషయమై నందినీ ఫ్రీడం యాప్ ప్రతినిధితో మాట్లాడుతూ…నా కలలను నిజం చేసింది Boss Wallahలేకపోయి ఉంటే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదేమో? నా వద్ద బ్యూటీషయన్ కోర్సు నేర్చుకున్నవారిలో ఇద్దరు మేకప్ స్టుడియో రన్ చేస్తుండగా మిగిలిన అందరికీ ఉద్యోగాలు దొరికాయి.” అని పేర్కొన్నారు. 

Related Posts

© 2025 bosswallah.com (Boss Wallah Technologies Private Limited.  All rights reserved.