Home » Latest Stories » విజయ గాథలు » ప్రైవేటు మాస్టర్ పంట పొలాల బాట పట్టి…దానిమ్మ సాగుతో లాభాలు పండిస్తూ..

ప్రైవేటు మాస్టర్ పంట పొలాల బాట పట్టి…దానిమ్మ సాగుతో లాభాలు పండిస్తూ..

by Sajjendra Kishore

చాలీ చాలనీ సంపాదనతో జీవితం గడుపుతున్నవారు తమ చెంత ఉన్న వనరులను సమర్థవంగా వినియోగించుకుంటే ఫలితం ఎంత మధురంగా ఉంటుందో దానిమ్మ రైతు రాయప్ప కథనం మీకు తెలియజేస్తుంది. ప్రైవేటు టీచర్‌గా బతుకీడుస్తున్న రాయప్ప దానిమ్మ సాగుతో లాభాలు పండిస్తూ అధిక ఆదాయాన్ని కళ్ల చూస్తున్నాడు. ఇతని జీవితాన్ని దగ్గరగా చూసిన వారు “మీలోని ఆలోచన మంచి మార్గంలో వెలుతూ ఉంటే విజయం నిన్ను వెదుక్కొంటూ నీ చెంతకు చేరుతుందని” వాఖ్యానిస్తున్నారు. మరి ఆ వాఖ్యానం ఎంతవరకూ నిజమో ఈ కథనం చదవి మీరూ చెప్పండి. 

బొటా బొటిగా చదివిన నా సంపాదన ఏడాదికి రూ.50 లక్షలు

దానిమ్మ రైతు కుమారుడైన రాయప్ప ఓ ప్రైవేటు టీచర్. ఇతని సంపాదన ఏడాదికి రూ.10 వేలు దాటడం లేదు. ఈ విషయాన్ని ఆయన తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరోజు “తొమ్మదో తరగతి మాత్రమే నేను చదివాను. ఏడాదికి నా సంపాదన రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకూ ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MSc) తో పాటు ఉపాద్యాయ శిక్షణ (BEd) కూడా పూర్తి చేసిన నీవు నెలకు రూ.10 వేలు మాత్రమే సంపాదిస్తున్నావు. ఇలా ఎందుకు జరుగుతోందో ఆలోచించన్నాడు.  ఆరోజు రాత్రి మొత్తం ఇదే ప్రశ్న అతని మదిని తొలిచేస్తూ ఉండేది. నేను సరైనా దారిలోనే వెలుతున్నానా? నాలో ఉన్న సామర్థ్యాన్ని వినియోగించుకోవడంలో నేను వెనుకబడ్డానా? మా నాన్న ప్రశ్న కరెక్టానా? నేను అంత పనికిరానివాడినా? ఇలా ఏవోవేవో ప్రశ్నలు? ఎన్నెన్నో ప్రశ్నలు రాయప్ప మెదిలో మెదిలాయి? దీంతో మంచి ఆదాయాన్ని న్యాయమైన మార్గంలో సంపాదించాలన్న కసి రాయప్పలో మొదలయ్యింది.

Boss Wallah సహకారం

ఇలాంటి ఆలోచనలతో రాయప్ప సంపాదనను ఎలా పెంచుకోవాలనే మార్గాలను వెదకడం ప్రారంభించారు. ఇదే క్రమంలో దానిమ్మ సాగు కు సంబంధించిన వివిధ రకాల కోర్సులు ఉన్న Boss Wallah గురించి తెలుసుకున్నారు. అందులో ఉన్న కోర్సులను నేర్చుకుని క్షేత్రస్థాయిలో అమలు చేస్తే మంచి ఆదాయం అందుకోవచ్చని తెలుసుకున్నారు. దీంతో వెంటనే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వివిధ కోర్సులు చూసి అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రాయప్ప సహజంగానే వ్యవసాయ కోర్సుల పట్ల మక్కువ చూపించారు. ముఖ్యంగా దానిమ్మను పండించాలనుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకున్నారు. అంటే దానిమ్మ మొక్కలను ఎక్కడ నుంచి సేకరించాలి? వాటిని ఎలా నాటాలి? దానిమ్మ పంటను ఆశించే వ్యాధులు? వాటి నివారణ తదితర విషయాల గురించి తెలుసుకున్నాడు. అదేవిధంగా Boss Wallah ద్వారా దానిమ్మ కు మార్కెట్‌లో ఉన్న డిమాండ్, సరఫరా తదితర విషయాల పై కూడా అవగాహన పెంచుకున్నాడు. యాప్ ద్వారా నేర్చుకున్న విషయాలతో మొదట 1.5 ఎకరాల్లో దానిమ్మ పంటను సాగు చేయడం మొదలు పెట్టి రెండేళ్ల తర్వాత రూ.4 లక్షల ఆదాయం అందుకున్నాడు. 

అదనపు ఆదాయం కోసం…

Boss Wallah యాప్ ద్వారా కేవలం దానిమ్మ, బొప్పాయి సాగు వంటి వ్యవసాయానికి సంబంధించిన కోర్సులనే కాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్ సంబంధ కోర్సులను కూడా ఆసక్తిగా చూసేవారు. ఇందులో  పొదుపు, మదుపు కోసం మ్యూచువల్ ఫండ్స్, షేర్స్‌ను ఎలా ఎంచుకోవాలో నేర్చుకున్నారు. వీటిలో సొంతంగా ఇన్వెస్ట్ చేస్తూ అవసరమైనవారికి సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. తద్వారా రూ.10వేల దాకా సంపాదిస్తున్నారు. తనకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటూ ప్రతి నెలా తన సంపాదనను పెంచుకుంటూ పోతున్నాడు. ఈ విషయమై రాయప్ప మాట్లాడుతూ “నా సంపాదాన పెరగడానికి ప్రధాన కారణం Boss Wallah. మా నాన్న మాటలు నాలో కసిని పెంచితే సంపాదన మార్గాన్ని చూపించింది మాత్రం ఈ యాప్. అందుకే ఈ యాప్‌ను వినియోగించమని నా ఫ్రెండ్స్, స్నేహితులకు కూడా చెబుతున్నాను.

Related Posts

© 2025 bosswallah.com (Boss Wallah Technologies Private Limited.  All rights reserved.