Home » Latest Stories » విజయ గాథలు » కూలి నుంచి లక్షల రుపాల ఆదాయం సంపాదించే వ్యాపారిగా 

కూలి నుంచి లక్షల రుపాల ఆదాయం సంపాదించే వ్యాపారిగా 

by Sajjendra Kishore

కష్టాలతో చివరి వరకూ కుంగిపోకుండా పోరాడారు. విజయం అతని చెంతకు వచ్చింది. కొత్తగూడెం వాసి శ్రీనివాస్ కథ వింటే ఎవరైనా ఈ వాఖ్యానాలు చేస్తారు. అంతే కాకుండా శహభాష్ అంటూ మెచ్చుకోకుండా ఉండలేరు. ఓ హోటల్ లో రోజువారి కూలిగా ఉన్న ఆయన Boss Wallah సలహాలు, సూచనలతో ఓ ఫుడ్ ట్రక్ యజమానిగా మారిపోయాడు. అంతేకాకుండా త్వరలో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తానని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.  వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ప్రేరణగా నిలిచే ఈ కథనం మీ కోసం…

కలలు కన్న కూలి…

పదోతరగతి వరకూ మాత్రమే చదువుకున్న శ్రీనివాస్ తెలంగాణలోని కొత్తగూడెంకు చెందినవాడు. రోజువారి కూలిగా ఓ హోటల్‌లో పనిచేసేవారు. చేతికి వచ్చే డబ్బులు కుంటుంబ ఖర్చులకు ఏమాత్రం సరిపోయేవి కావు. దీంతో ఎలాగైనా కష్టపడి వ్యాపారం చేయాలని భావిస్తూ ఉండేవాడు. అయితే ఎక్కడ? ఎలా? ఎంత పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాలి? ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలి? అన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు.

చేయూతనిచ్చిన Boss Wallah 

ఈ నేపథ్యంలో శ్రీనివాస్ తన స్నేహితుని ద్వారా Boss Wallah గురించి తెలుసుకున్నాడు. అటు పై దానిలో సభ్యుడై అందులో ఉన్న కోర్సులను చూసాడు. ముఖ్యంగా యాప్‌లో ఉన్న ఫుడ్ ట్రక్ బిజినెస్, పౌల్ట్రీ కోర్సులు, గంధపు, చెక్కల పెంపకం, రెడ్ వుడ్ పెంపకం, రెస్టారెంట్ నిర్వహణకు సంబంధించిన వివిధ కోర్సుల గురించి తెలుసుకున్నాడు. అదేవిధంగా ఫైనాన్స్ సంబంధిత కోర్సుల్లో చేరి సొమ్ము నిర్వహణ విషయమై అవగాహన పెంచుకున్నాడు. ఇన్ని కోర్సులను చూసిన తర్వాత తనకు ఇప్పటికే అనుభవం ఉన్న ఫుడ్ ట్రక్ వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో Boss Wallah ద్వారా ఫుడ్ ట్రక్ ప్రారంభానికి అవసరమైన అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ముఖ్యంగా పెట్టుబడి ఎంతవుతుంది? ఎటువంటి వాహనం స్థానిక పరిస్థితులకు సరిపోతుంది? వంటి గదికి సంబంధించిన పరికరాలు ఏవి? ముడి పదార్థాలను ఎక్కడ నుంచి సేకరించాలి? వంటి విషయాలను తెలుసుకున్నాడు. అదేవిధంగా ఫుడ్ ట్రక్ నిర్వహణకు అవసరమైన ముడి పదార్థాలను ఎక్కడ నుంచి సేకరించాలి? వ్యాపారాన్ని ఎక్కడ నుంచి ప్రారంభించాలి? వంటి విషయాల పై అవగాహన పెంచుకున్నాడు. అంతేకాకుండా స్థానిక ప్రభుత్వాల నుంచి అనుమతులు ఎలా పొందాలో నేర్చుకున్నారు. మెను, సిబ్బంది, మార్జిన్ వంటి విషయాలతో పాటు మార్కెటింగ్ విషయాల పై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకున్నాడు. 

మూడు నెలల కష్టం కాదు పరీక్షా సమయం

మొత్తంగా Boss Wallah ఇచ్చిన సహకారం, ప్రోత్సాహంతో శ్రీనివాస్ వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే మొదటి మూడు నెలలు కనీసం రోజువారి ఖర్చులు కూడా వ్యాపారం ద్వారా సంపాదించేవాడు కాదు. అయినా పట్టువీడలేదు. యాప్ ప్రతినిధులు అందించిన సూచనలు, సహకారంతో తాను నిర్వహిస్తున్న ఫుడ్ ట్రక్ బిజినెస్‌ను లాభాల పాట పట్టించాడు. కొద్ది రోజుల్లోనే ఇతని ఆదాయం లక్షల రుపాయల మార్కును అందుకోబోతున్నది. 

ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఉన్నతంగానే…

శ్రీనివాస్ తయారు చేస్తున్న ఆహారానికి వినియోగదారుల ద్వారా మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. దీంతో బిజినెస్ ప్రతిరోజూ అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫుడ్‌ట్రక్ బిజినెస్ ను రెస్టారెంట్ స్థాయికి పెంచాలన్నది తన భవిష్యత్ ప్రణాళికగా పెట్టుకున్నాడు. వచ్చే ఐదు సంవత్సరాల్లో అతను మరిన్ని రంగాలకు సంబంధించిన వ్యాపారాలను ప్రారంభించాలని కూడా ప్రణాళికలు రచిస్తున్నాడు. ముఖ్యంగా డైరీ ఫార్మింగ్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ విషయమై శ్రీనివాస్ Boss Wallah ప్రతినిథితో మాట్లాడుతూ “ రోజు కూలిగా పనిచేసే సమయంలో నేను గుడిసెలో నివశించేవాడిని. ఫుడ్ ట్రక్ బిజినెస్ ప్రారంభించిన తర్వాత నా సంపాదన పెరిగింది. ఈ విషయం చాలదా? నేను ఎలా ఎదుగుతున్నానో చెప్పడానికి? ఈ నా ఎదుగుదలకు కారణమైన Boss Wallah కు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను.” అని చమర్చిన కళ్లతో పేర్కొన్నాడు. 

Related Posts

© 2025 bosswallah.com (Boss Wallah Technologies Private Limited.  All rights reserved.