Home » Latest Stories » విజయ గాథలు » నష్టాల సాగు నుంచి రూ.10 లక్షల ఆదాయం వైపు

నష్టాల సాగు నుంచి రూ.10 లక్షల ఆదాయం వైపు

by Bharadwaj Rameshwar

“నష్టాల నుంచి పాఠాలు నేర్చుకుని విజయ తీరాలకు చేరారు.”  అన్న వాఖ్యాలు విజయ్ కుమార్ చవ్వా కు సరిపోతాయి. సాగు, పశుపోషణలో నష్టాలు చవిచూసిన ఈ రైతు Boss Wallah సహకారంతో సాగు, పశుపోషణలో మెళుకువలు తెలుసుకున్నారు. దీంతో ఉత్తమ రైతుగా తమ ప్రాంతం వారితో ప్రశంసలు అందుకుంటున్నారు. 

మొదట్లో అన్నీ అపజయాలే..

తెలంగాణాకు చెందిన విజయ్ కుమార్ చవ్వా బి.కామ్‌ గ్రాడ్యుయేట్‌. హార్డ్ వేర్ కంపెనీ ప్రారంభించారు. అయితే కొన్ని కారణాల వల్ల అటు పై ఓ ప్రైవేట్ కంపెనీలో పదేళ్లు పనిచేశారు. అయితే ఇవి ఏవి అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. వ్యవసాయం చేయాలని భావించేవారు. దీంతో పూర్తి స్థాయి రైతుగా మారిపోయారు. తనకున్న పొలంలో నాటు కోళ్లు, చేపల పెంపకాన్ని చేపట్టారు. అవగాహన లేమితో వందల సంఖ్యలో కోళ్లు, వేల సంఖ్యలో చేపలు చనిపోయి. దీంతో అనవసరంగా ఈ రంగంలోకి వచ్చానేమోనని అప్పుడప్పుడు తన తోటి వారితో బాధ పడేవారు. 

చేసిన తప్పులు నుంచి నేర్చుకుని

ఈ క్రమంలో వినయ్ కుమార్ చవ్వాకు Boss Wallah గురించి తెలిసింది. డెమో వీడియో చూసి యాప్ సబ్ స్క్రిప్షన్ తీసుకుని సమగ్ర వ్యవసాయ విధానం కోర్సు ద్వారా వ్యవసాయ, పశుపోషణకు సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకున్నారు. పౌల్ట్రీ, చేపల పెంపకంలో తన అపజయానికి ప్రధాన కారణం శాస్త్రీయంగా షెడ్స్ నిర్మించకపోవడం అని తెలుసుకున్నారు. అంతేకాకుండా వ్యాధులు వచ్చినప్పుడు చేపట్టాల్సిన చర్యల పై అవగాహన లేకపోవడమేనని అర్థం చేసుకున్నారు. అయితే ఫ్రీడం యాప్ ద్వారా సమీకృత లేదా సమగ్ర వ్యవసాయం విధానం చేయడం ద్వారా ఎక్కువ లాభాలు అందుకోవచ్చునని తెలుసుకున్నారు. 

ఉత్తమ రైతుగా ఎదిగి

తనకున్న 26 ఎకరాల పొలంలో పదుల సంఖ్యలో ఆకుకూరలు పండిస్తున్నారు. ఇవన్నీ ఒకే సమయంలో కాకుండా వేర్వేరు సమయంలో కోతకు వస్తున్నాయి. దీంతో నిత్యం వీటి ద్వారా రాబడి ఉంటోంది. అదేవిధంగా 25 పాడి పశువులతో ప్రారంభమైన పాల కేంద్రంలో పశువుల సంఖ్య 70కు చేరుకుంది. ఇందులో కూడా వేర్వేరు జాతుల పశువులు ఉన్నాయి. అదేవిధంగా నాటుకోళ్లు, చేపల పెంపకం కూడా చేపడుతున్నారు. ఇక వేర్వేరు ఉద్యాన పంటలను కూడా పండిస్తున్నారు. మొత్తంగా వినయ్ కుమార్ చవ్వా కు సమగ్ర లేదా సమీకృత వ్యవసాయం ద్వారా ఏడాదికి రూ.10 లక్షల వరకూ ఆదాయం వస్తోంది. దీంతో ప్రభుత్వం కూడా ఉత్తమ రైతుగా నవీన్‌ను గుర్తించి సన్మానించింది. అంతే కాకుండా ప్రతి రోజూ ఎంతమంది రైతులు నవీన్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తూ అనేక విషయాలను తెలుసుకుంటున్నారు.  ఈ విషయమై వినయ్ కుమార్ ఫ్రీడం యాప్ ప్రతినిధితో మాట్లాడుతూ… “నష్టాల వల్ల కుంగిపోలేదు. వాటి నుంచి పాఠాలను నేర్చుకుని వినూత్న మార్గంలో ముందుకు వెళ్లడమే నా విజయ రహస్యం. సరైన సమయంలో సరైన మార్గదర్శనం చేసిన Boss Wallah కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాను.” అని పేర్కొన్నారు. 

Related Posts

© 2025 bosswallah.com (Boss Wallah Technologies Private Limited.  All rights reserved.