Home » Latest Stories » విజయ గాథలు » తక్కువ ధరకు అమ్మతూ…ఎక్కువ లాభం అందుకుంటూ

తక్కువ ధరకు అమ్మతూ…ఎక్కువ లాభం అందుకుంటూ

by Bharadwaj Rameshwar

“వ్యాపార సూత్రాలను ఒంటపట్టించుకుంటే రైతే రాజుగా మారుతాడు” అని కర్ణాటకకు చెందిన నరసింహ మూర్తి జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. తనకు అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించుకుని అధిక ఫలసాయం అందుకుంటున్నారు. అంతే కాక అటు సేవతో పాటు వ్యాపారాన్ని బాగా నిర్వహిస్తున్న ఈ ఉత్తమ రైతు ఎందరికో అదర్శం. 

కర్ణాకటలోని తుమకూరు జిల్లా మధుగిరి తాలూక జాడే గొండెనహళ్లి గ్రామానికి చెందిన నరసింహ మూర్తి మొదట్లో ఓ సాధారణ రైతు. అయితే అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకుని ఉత్తమ రైతుగా ప్రశంసలు అందుకుంటున్నారు. 

కొత్తదనం కోసం తపన

నరసింహ మూర్తి ఓ సాధారణ రైతు తనకు ఉన్న పొలంలో మొదట చిరుధాన్యాలు పండించి అమ్మేవారు. సాధారణ రైతులే వల మధ్యవర్థుల చేతుల్లో ఉన్న మార్కెట్ ధరను అనుసరించే అతని పంటకు ధర దక్కేది. దీంతో ఒక్కొక్కసారి పండిన పంటకు గిట్టుబాటు ధర కూడా దక్కేది కాదు. ఏప్పుడో కాని లాభాలు వచ్చేవి. అయితే ఆయన కుంగిపోలేదు. అందరూ వెళ్లే దారిలో వెళితే లాభాలు రావని భావించారు. దీంతో సరికొత్త మార్గంలో వ్యవసాయం చేసి లాభాలు గడించాలని భావించారు. ఈ విషయంలో ఏదేని సహాయం అందుతున్న ఉద్దేశంతో ఫ్రెండ్స్‌తో సలహాలు తీసుకునేవారు. ఈ క్రమంలో నరసింహ మూర్తికి Boss Wallah గురించి తెలిసింది.

బొప్పాయి సాగు (Papaya Farming ) పై మక్కువ

స్వతహాగా రైతు అయిన నరసింహ మూర్తి వ్యవసాయ సంబంధ కోర్సుల పై మక్కువ ఏర్పడింది. ఈ క్రమంలో బొప్పాయి సాగు  (Papaya Farming ) పై మక్కువ పెంచుకుని ఇందులోని మెళుకువలన్నీ నేర్చుకున్నారు. బొప్పాయి పంటను పండించడానికి అనువైన భూమి, వాతావరణ పరిస్థితుల పై అవగాహన పెంచుకున్నాడు. అదేవిధంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను ఎలా ఎంచుకోవాలో నేర్చుకున్నారు. బొప్పాయి పంటకు భూమిని ఎలా సిద్ధం చేయాలి? ఎంతమంది కూలీలు అవసరం, నీటి పారుదల, ఎరువులు, బొప్పాయి  (Papaya Farming ) పంటను ఆశించే చీడలు, వ్యాధులు, నివారణ, అంతేకాకుండా వ్యాధి నివారణ కోసం పిచకారీ మందులు తదితర విషయాల పై స్పష్టత ఏర్పడింది. అటు పై పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్యాకింగ్, అమ్మకం, ఎగుమతుల విషయంలో పాటించాల్సిన మెళుకువల గురించి నేర్చుకున్నారు. ముఖ్యంగా బొప్పాయి పంట సాగు, ఖర్చు పై స్పష్టత ఏర్పడింది. 

స్థానిక వనరులను వినియెగించుకుంటూ

పంట పండిన తర్వాత తనకున్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే అధిక లాభాలు ఎలా అందుకోవచ్చో నరసింహ మూర్తి చెబుతున్నారు. ఈయన పొలం హైవేకు అత్యంత సమీపంలో ఉంది. దీనినే లాభాల బాటకు., అనువైన మార్గంగా ఎంచుకున్నారు నరసింహ మూర్తి. ఒక ఎకరాలో బొప్పాయి పంట పండించన తర్వాత పంటను దళారులకు లేదా మార్కెట్‌లో అమ్మలేదు. నరసింహమూర్తి హైవే పక్కన చిన్న దుకాణం తెరిచి అక్కడ బొప్పాయిని  (Papaya Farming )  అమ్మడం మొదలు పెట్టారు. మార్కెట్‌ ధర కంటే కొంత తక్కువ రేటుకే విక్రయించేవారు. అయినా కూడా అధిక లాభాలు అందుకుంటున్నారు. ఈ విషయమై నరసింమ మూర్తి ఫ్రీడం యాప్ ప్రతినిధితో మాట్లాడుతూ…” బొప్పాయి పంటను  (Papaya Farming ) నేరుగా వినియోగదారులకే విక్రయించడం వల్ల దళారుల బెడద తప్పుతోంది. దీంతో మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే విక్రయించినా కూడా నాకు అధిక లాభం వస్తోంది. ఇక వినియోగదారునకు మార్కెట్ కంటే తక్కువ ధరేకే దొరకడం వల్ల ఎక్కువ మంది నా దగ్గరే కొనడానికి వస్తున్నారు. ఇలా రైతుకు అటు వినియోగదారునకు కూడా లాభం. అందువల్లే మిగిలిన పొలంలో పండిన పంటను కూడా ఇలాగే నేరుగా విక్రయించాలని ఆలోచిస్తున్నాను. సాగు విషయమై నా దృక్పథాన్ని మార్చిన Boss Wallah కు ధన్యవాధాలు.” అని పేర్కొన్నారు.

Related Posts

© 2025 bosswallah.com (Boss Wallah Technologies Private Limited.  All rights reserved.