Home » Latest Stories » విజయ గాథలు » వ్యాపారవేత్తగా మారిన రైతు

వ్యాపారవేత్తగా మారిన రైతు

by Bharadwaj Rameshwar

“పోయిన చోటే వెదుక్కోవడం” అంటే అర్థం ఏమిటో కర్ణాటకకు చెందిన శివన్న మనకు తెలియజేస్తున్నారు. కోవిడ్ వల్ల ట్రావెల్ బిజినెస్‌లో నష్టాలు చవిచూసిన ఈయన రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి తాను పోగొట్టుకున్న బిజినెస్ ప్రారంభించడమే కాకుండా తిరిగి లాభాలను చవిచూస్తున్నారు. అంతేకాకుండా కూరగాయలను పండించడమే కాకుండా స్వయంగా అమ్ముతూ ఎక్కువ లాభాలను గడిస్తున్నారు. ఇలా రెట్టించిన ఉత్సాహంతో పోగొట్టుకున్న వ్యాపారంలో తిరిగి పుంజుకోవడమే కాకుండా కూరగాయల షాపును పెట్టి లాభాలు పొందడానికి కారణం ఏమిటో ఈ స్ఫూర్తిదాయక కథనం ద్వారా మీరు కూడా తెలుసుకోండి. 

కోవిడ్ వల్ల ట్రావెల్ బిజినెస్ లో నష్టం వచ్చి

వ్యవసాయ కుటుంబానికి చెందిన శివన్న స్వస్థలం కర్ణాటకలోని మండ్యా. పదోతరగతి చదువుకున్న ఇతను బెంగళూరు చేరుకుని క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవారు. ఈ క్రమంలోనే ఆరు కార్లను కొని వాటిని వివిధ కంపెనీలకు అద్దెకు ఇస్తూ ట్రావెల్ బిజినెస్ చేస్తూ బాగానే సంపాదించేవారు. అయితే కోవిడ్ ఆయన జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఆరు కార్లలో ఐదింటిని అమ్మేసారు. 

ప్రేరణ ఇచ్చిన Boss Wallah

ఈ క్రమంలో ఓ సారి Boss Wallah గురించి తెలిసింది. వెంటనే డౌన్లోడ్ చేసుకున్న శివన్న వివిధ కోర్సుల గురించి తెలుసుకున్నారు. మొదట స్వంత ఊరికి వెళ్లి సమీకృత వ్యవసాయ విధానంలో కూరగాయలను పెంచారు. అటు పై వాటిని స్వతంగా విక్రయిస్తూ కొంత లాభాలను గడించారు. అటు పై బెంగళూరుకు చేరుకుని మొదట్లో తాను పనిచేసిన కాబ్ డ్రైవర్ ఉద్యాన్ని చేస్తూ తిరిగి 5 కార్లను కొని కంపెనీలకు అద్దెకు ఇవ్వడం మొదలు పెట్టారు. మొత్తంగా ఈ వాహనాలను అద్దెకు ఇస్తూ నెలకు రూ.50వేలు సంపాదించడం మొదలు పెట్టారు. దీనికి అదనంగా వీకెండ్స్‌లో స్వంత ఊరు నుంచి కాయకూరలు తెచ్చి ఇక్కడ తాను ఏర్పాటు చేసుకున్న షాపులో బయటి మార్కెట్ ధరల కంటే తక్కువకే అమ్మేవారు. అయినా లాభాలు ఎక్కువగా వచ్చేవి. ఈ విషయమై శివన్న మాట్లాడుతూ “కోవిడ్ వల్ల అన్నీ కోల్పోయి నిరాశలోఉన్న నాకు ప్రేరణ కలిగించినది Boss Wallah. ఇందులో వివిధ కోర్సులను చూసి బిజినెస్ మెళుకువలను మెరుగుపరుచుకున్నాను. అందుకే నష్టపోయిన చోటే లాభాలు సంపాదించాను. నాకు ప్రేరణ ఇచ్చిన Boss Wallah” కు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నాను. అని పేర్కొన్నారు. 

Related Posts

© 2025 bosswallah.com (Boss Wallah Technologies Private Limited.  All rights reserved.