Home » Latest Stories » విజయ గాథలు » గృహిణి..ఉద్యోగి..వ్యాపారవేత్త

గృహిణి..ఉద్యోగి..వ్యాపారవేత్త

by Bharadwaj Rameshwar

“మల్టీటాస్కింగ్ కు బ్రాండ్ అంబాసిడర్” అని మన హైదరాబాద్‌ కు చెందిన అర్చనను పేర్కొనవచ్చు.  ఆమె ఓ వైపు గృహిణిగా, మరోవైపు ప్రైవేటు సంస్థ ఉద్యోగిగా పనిచేస్తూనే పికిల్ బిజినెస్ ను (పచ్చళ్ల వ్యాపారం) విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇలా వివిధ రకాల బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్న అర్చన విజయ గాథను మీరు చదవండి.

నలుగురితో త్వరగా కలిసిపోయే మనస్తత్వం 

హైదరాబాద్ నగరానికి చెందిన అర్చన వయస్సు 40 ఏళ్లు. బీ.కాం పూర్తి చేసిన ఈమె మొదట్లో గృహిణిగా ఉండేవారు. అటు పై ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా చేరారు. నలుగురితో త్వరగా కలిసిపోయే మనస్తత్వం ఉన్న అర్చన తనతో పాటు పనిచేసే వారు ఇంటికి దూరంగా ఉంటూ మనసుకు నచ్చిన తిండి దొరక్క చాలా ఇబ్బంది పడేవారు. దీనిని గమనించిన అర్చన తనకు వీలున్నప్పుడు ఇంటి నుంచి వంట చేసుకుని వెళ్లి తనతో పాటు పనిచేసేవారికి ఇచ్చేవారు. వారి నుంచి అందే ప్రశంసలు ఆమెలో దాగున్న వ్యాపార ఆలోనలకు రెక్కలు తొడిగాయి. 

Boss Wallah సహకారంతో…

ఆహార పదార్థాలను రుచి కరంగా తయరు చేసే సామర్థ్యం తనలో ఉందని తెలుసుకున్న తర్వాత దానినే వ్యాపారంగా ఎందుకు మలచుకోకూడదని భావించారు. ఈ క్రమంలోనే ఫ్రెండ్స్ ద్వారా Boss Wallah గురించి తెలుసుకుని దానిని డౌన్లోడ్ చేసుకున్నారు. అటు పై క్లౌండ్ కిచెన్, పచ్చళ్ల (పికిల్స్) తయారీ కోర్సుతో పాటు హోం బేస్డ్ బేకరీ కోర్సులను నేర్చుకున్నారు. ఈ మూడింటిలో ప్రస్తుతం తన పరిస్థితులకు సరిపోయే పచ్చళ్ల (పికిల్స్) తయారీ పై ఎక్కువగా దృష్టి పెట్టారు. యాప్ ద్వారా ఈ పచ్చళ్ల వ్యాపారానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, అనుమతులు, పెట్టుబడి, తదితర విషయాల పై అవగాహన పెంచుకున్నారు. అటు పై ఏ ఏ సమయంలో ఏ ఏ పికిల్స్ కు డిమాండ్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఎలా వంటి విషయాల పై అవగాహన పెంచుకున్నారు. అటు పై బ్రాండింగ్, మార్కెటింగ్‌తో పాటు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ధర నిర్ణయించడం వంటి విషయాలను కూడా నేర్చుకున్నారు.

లొట్టలేసుకుని తింటూ…ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. 

యాప్ ద్వారా నేర్చుకున్న విషయాలను అనుసరించి అర్చన ప్రతి రోజూ నాలుగు గంటలు సమయాన్ని వెచ్చించి పచ్చళ్లు తయారు చేసారు. వాటిని మొదట సాంపుల్స్‌గా తనతో పాటు పనిచేసే వారికి ఇచ్చారు. అంతే వారు ఆ పచ్చళ్లను లొట్టలేసుకుంటూ తినడం మొదలుపెట్టారు. అంతేనా అర్చన అడగడానికి ముందే ఆర్డర్లు ఇచ్చేసి కొనడం మొదలు పెట్టారు. అటు పై మొల్లగా స్నేహితులు, బంధువులు కూడా అర్చన తయారు చేసే పచ్చళ్లకు ఫ్యాన్స్ అయిపోయారు. దీంతో క్రమంగా అర్డర్ల సంఖ్య పెరిగింది. 

నెలకు రూ.10వేల అదనపు ఆదాయం

రోజుకు నాలుగు గంటల పాటు పనిచేస్తూ పచ్చళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేవలం తన తోటి ఉద్యోగుల నుంచి అందే ఆర్డర్ల నుంచే నెలకు రూ.10వేల అదనపు ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఈ విషయమై అర్చన మన ఫ్రీడం యాప్ ప్రతినిధితో మాట్లాడుతూ..” మనలో ఉన్న సామర్థ్యాన్ని సరిగా వినియోగించుకుంటే ఏ రంగంలోనైన ముందుకు వెలుతాం. అయితే సరైన సమయంలో సరైన సహకారం అందించేవారు మనకు కావాలి. ఈ విషయంలో Boss Wallah నాకు ఎంతో సహాయ, సహకారాలు అందించింది. అందుకే ఓ గృహిణిగా ఇంటి అవసరాలు తీర్చుతూ అటు ఉద్యోగిగా, ఇటు వ్యాపారవేత్తగా కూడా రాణించగలుగుతున్నాను.” అని పేర్కొన్నారు.

Related Posts

© 2025 bosswallah.com (Boss Wallah Technologies Private Limited.  All rights reserved.