Home » Latest Stories » వ్యవసాయం » సిరులు కురిపిస్తున్న పంగాసియస్ జలపుష్పాల గురించి తెలుసుకుందామా?

సిరులు కురిపిస్తున్న పంగాసియస్ జలపుష్పాల గురించి తెలుసుకుందామా?

by Bharadwaj Rameshwar

పంగాసియస్ చేపలు అనగానే, మీరందరూ ఇంతకుముందు ఎప్పుడూ వినలేదే అని అనుకోవచ్చు. అయితే క్యాట్ ఫిష్ అనో లేదా వాలుగ చేప అంటే మాత్రం యిట్టె చెప్పేస్తారు. పంగాసియస్ అనేది క్యాట్ ఫిష్ లో ఒక రకం!  క్యాట్ ఫిష్ లో కొన్ని మంచి చేపలు, కొన్ని చెడ్డ చేపలు ఉంటాయి. అయితే ఫంగస్ చేప అని పిలువబడే ఈ రకం  చేపలో, ఎన్నో పోషకాలు ఉన్నాయి. 

వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. మిగతా చేపలతో పోలిస్తే, క్యాట్ ఫిష్ చూడడానికి విభిన్నంగా ఉంటుంది. దీనికి పొలుసులు ఉండవు.  అందుకనే, తెలుగు రాష్ట్రాలలో చాలా మంది వీటిని తినడానికి ఆసక్తి చూపించరు. కానీ దీనిలో ఉండే పోషకాలు, దీని గురించి తెలుసుకుంటే, నెక్స్ట్ టైం, వద్దని అనలేరు! దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందామా?

అపోలో ఫిష్ తిన్నారా?

వీటిలో కేవలం, ఒకే ముల్లు ఉండడం వల్ల, హోటల్స్ మరియు రెస్టారెంట్లలో అపోలో ఫిష్ అనే వంట కోసం వినియోగిస్తారు. ఈ డిష్, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వంటకం. దీనిని ఫంగస్ చేప లేదా బస చేప, పంగా చేప అని కూడా పిలుస్తూ ఉంటారు.  ఇది గుండెకి చాలా  మంచిది, అలాగే తక్కువ కొవ్వు కలిగిన ఈ చేపలో ప్రోటీన్ మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల, ఆరోగ్యం కోసం కూడా చాలా మంది వీటిని తింటూ ఉంటారు. ఇది మంచి నీటి చేప. అందువల్ల, నెక్స్ట్ టైం, ఈ ఫిష్ తినాల్సి వచ్చేటప్పుడు, మరేం ఆలోచించకుండా  ఫుల్లుగా లాగించేయ్యండి!

ఈ చేప సాగు గురించి మరింత లోతుగా తెలుసుకోండి!

హోటల్లలో, చాలా మంది దీనిని ఇష్టంగా తినడం వల్ల, దీనిని పెంచే వారికి కాసులు కురిపిస్తున్నాయి. అందువల్ల, ఫంగస్ చేపను  పెంచేందుకు రైతులు  ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. ఇదొక కార్ప్ జాతికి చెందిన చేప. ఇది మంచినీటిలో ఉంటుంది, కాబట్టి దీనిని పెంచడం మిగతా, జాతులతో పోల్చినప్పుడు, చాలా తేలిక! వీటిని కేజ్ కల్చర్ ద్వారా కానీ, తొట్టిలలో కానీ పెంచవచ్చు. ఇవి పూర్తిగా పెరగడానికి, 7  నెలల సమయం పడుతుంది. ఇవి 2.5  నుంచి మూడు కేజీల బరువు తూగుతాయి. ఇప్పటికే, దీని సాగు చేస్తున్న వారు, ఏడు నెలలకి అక్షరాలా 20 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. 

మీరు కూడా,   ఫంగస్ చేప  ఫార్మింగ్ చేసి, మంచి లాభాల కోసం ఎదురు చూస్తున్నా లేదా ఇతర సాగు విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నా, Boss Wallah లో మీకు ఈ కోర్సు లభిస్తుంది. 

ఈ కోర్స్ నుంచి, క్యాట్ ఫిష్ సాగు అంటే ఏమిటి,  మనం ఎన్ని విధాలుగా ఏ సాగుని చెయ్యవచ్చు, వీటిని ఏ పద్దతిలో పెంచాలి, పెంచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వీటికి మేత ఎలా ఉండాలి అనేవాటితో పాటుగా, 

ఇవి ఉండే నీళ్ల ట్యాంక్లలో నీటిని ఎలా ఉండేలా చూసుకోవాలి. ఇవి పెంచే సమయంలో, మనకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై పూర్తి అవగాహన లభిస్తుంది. 

 మీ ఆశయానికి, Boss Wallah  ఎప్పుడూ మీ   వెంటే ఉంటుంది. ఈరోజే, ఫంగస్ చేపల ద్వారా ఎలా సంపాదించాలో నేర్చుకోవడం మొదలుపెట్టండి!

Related Posts

© 2025 bosswallah.com (Boss Wallah Technologies Private Limited.  All rights reserved.